నేటి మాట

బ్రతుకు ఒక పోరాటం, దాని కోసం ఆరాటం పనికి రాదు. --కాళోజి-!

ఐష్ పాటలో సన్నీలియోన్!


బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్... ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌తో పోటీపడుతోంది. అదేంటి? వారిద్దరి మధ్య పోటీ ఏంటని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే...1999లో ఐశ్వర్యరాయ్, సల్మాన్‌ఖాన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం హమ్‌దిల్ దే చుకే సనమ్. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్‌పై తెరకెక్కించిన ధోలీ తారో ధోలీ భాజే గీతం సూపర్‌హిట్‌గా నిలవడమే కాకుండా అనేక అవార్డుల్ని అందుకొంది. ప్రస్తుతం ఈ గీతం రీమిక్స్ రూపంలో లీలా చిత్రంతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకురానుంది.

సన్నీలియోన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి బాబీఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ పాట రీమిక్స్ హక్కులను హమ్‌దిల్‌దే చుకే సనమ్ నిర్మాత భూషణ్‌కుమార్ నుంచి సొంతం చేసుకున్న బాబీఖాన్ దీనిని సన్నీలియోన్‌పై తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటలో సన్నీలియోన్ నృత్యాలు ఐశ్వర్యరాయ్‌కు ధీటుగా ఒరిజినల్ సాంగ్‌ను మరిపించేలా వుంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ రీమిక్స్ ఓ సవాల్‌గా స్వీకరించిన సన్నీలియోన్ ఇందుకోసం కొన్నాళ్లుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆమె ఈ పాటకు పూర్తిగా న్యాయం చేస్తుందనే నమ్మకముందని దర్శకుడు బాబీ ఖాన్ చెబుతున్నారు.

0 comments:

Post a Comment

Viewers

Popular Posts

Latest Posts

Education

Health

Hyderabad

Business

Sports