ఇది కుబేరుల దునియా
మొత్తం ప్రపంచ సంపదలో సగభాగాన్ని అత్యంత సంపన్నులైన ఒకశాతం మంది అనుభవిస్తున్నారని స్విట్జర్లాండ్ నుంచి పని చేసే పెట్టుబడుల సంస్థ క్రెడిట్ సూయిస్సీ విడుదల చేసిన వార్షిక ప్రపంచ సంపద నివేదిక తేల్చింది. శతకోటీశ్వరులవద్ద సంపద గతేడాది 46% ఉంటే.. ఈసారి అది 48.2శాతానికి చేరుకుంది. 2008లో ఆర్థిక వ్యవస్థ కుదేలైన తర్వాత ప్రపంచ ఆర్థిక స్థితిగతుల్లో వ్యత్యాసం మరింతగా పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది.
2013 మధ్యకాలం నుంచి 2014 మధ్యకాలం వరకు ప్రపంచ సంపద కొత్త రికార్డులు సృష్టిస్తూ 20.1 ట్రిలియన్ డాలర్లు (1226 లక్షల కోట్ల రూపాయలు) పెరిగి, 16043
లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. 2000 సంవత్సరంతో పోల్చితే ఇది 7143 లక్షల కోట్ల రూపాయల మేరకు (8%)పెరిగిందన్నమాట. గత ఏడాదితో పోల్చితే ప్రపంచ సంపద పెరుగుదల వేగంగా ఉన్నప్పటికీ ఆర్థిక సంక్షోభం ముందటి సంవత్సరమైన 2007తో పోల్చితే అత్యంత వేగంగా పెరిగింది. ఈ మొత్తం సంపదలో ప్రపంచ జనాభాలో దాదాపు సగ భాగం వద్ద కేవలం ఒక శాతం మాత్రమే ఉంది. మరోవైపు ప్రపంచ సంపదలో 87శాతాన్ని ఒక శాతం మంది ధనికవర్గంకలిగి ఉంది.
అందులోనూ అగ్రశ్రేణి కుబేరులవద్ద ప్రపంచంలోని 48.2% సంపద పోగుపడి ఉందని నివేదిక వెల్లడించింది. గత ఏడాది కుబేరుల వద్ద ఉన్న సంపద 46 శాతంగా ఉంది. కుబేరుల సంపద పెరుగుదలరేటు ఇలాగే కొనసాగుతుందని ఊహిస్తే.. రానున్న 23ఏండ్లలో ఒకశాతం కుబేరులు ప్రపంచ సంపద మొత్తానికీ యజమానులవుతారు. ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో అది ధనికులకే సానుకూలంగా మారిందని నివేదిక పేర్కొనటం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలోనూ కుబేరుల ఆస్తులు పెరిగిపోవడం కొసమెరుపు.

ఐదేండ్లలో 61% పెరుగనున్న భారత కుబేరులు
రానున్న ఐదేండ్లలో భారతదేశలో కోటీశ్వరుల సంఖ్య (డాలర్ మిలియనీర్స్)ప్రస్తుతం ఉన్న 1.82 లక్షల నుంచి 2.94 లక్షలకు (61%)పెరుగవచ్చని క్రెడిట్ సూయిస్సీ అంచనా వేసింది. దేశంలో ప్రైవేటు ఆస్తులు రానున్న ఐదేండ్లలో 9శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసుకుంటాయని పేర్కొంది. రూ.6.1 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నవారిని డాలర్ మిలియనీర్స్గా నివేదిక నిర్వచించింది. 2000 సంవత్సరంలో వయోజనులైన అత్యధిక ధనవంతులు 10శాతం మంది మొత్తం భారతీయ సంపదలో 65.9శాతం వాటా కలిగి ఉంటే.. 2014లో అది 74శాతానికి పెరిగిందని నివేదిక తెలిపింది. దేశంలోని వయోజనుల్లో 94.5శాతం మంది రూ.6.1 లక్షల సంపద (10,000 డాలర్లు)కలిగి ఉన్నట్లు పేర్కొంది.
0 comments:
Post a Comment