నేటి మాట

బ్రతుకు ఒక పోరాటం, దాని కోసం ఆరాటం పనికి రాదు. --కాళోజి-!

Showing posts with label Maharastra. Show all posts
Showing posts with label Maharastra. Show all posts
మజ్లిస్అనూహ్య సంచలనం.!

మూడు చోట్ల గెలుపు.. ఒక చోట ఆధిక్యం.. మజ్లిస్పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో స్థాయిలో రాణించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. మామూలుగా అయితే మజ్లిస్పార్టీ పేరుఆల్ఇండియా మజ్లస్ఇత్తెహాదుల్ముస్లిమీన్‌’ అయినా.. పార్టీ కేవలం తెలంగాణ రాజధాని హైద్రాబాద్కే పరిమితమైపోయింది. అడపా దడపా తెలంగాణలోని మరికొన్ని నియోజకవర్గాల్లో మజ్లిస్కి కొంత ఓటు బ్యాంకు వున్నట్లు నిరూపితమవుతున్నా.. అవేవీ పార్టీకి ప్రజా ప్రతినిథుల్ని తెచ్చిపెట్టే రేంజ్లో కావు. కానీ, మహారాష్ట్రలో మాత్రం మజ్లిస్పార్టీ మూడు ఎమ్మెల్యే సీట్లను దక్కించుకుంది. ఇంకో సీటు దక్కేలా వుంది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఇదివరకు కూడా మహారాష్ట్రలో మజ్లిస్తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించింది. హైద్రాబాద్తో సమానంగా, మహారాష్ట్రలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని మజ్లిస్సీరియస్గా తీసుకుంటూ వస్తోంది. ఈసారి దక్కిన ఫలితాలతో మజ్లిస్వర్గాల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేనలకు ఎక్కువ సీట్లు దక్కడంతో మజ్లిస్ఉనికి చాటుకున్నా.. పార్టీకి ఒరిగేదేమీ వుండకపోవచ్చు. కానీ, ఎంతో కొంత మహారాష్ట్రలో మజ్లిస్శ్రేణులు మాత్రం తమ పార్టీని మరింతగా విస్తరించేందుకు ఫలితాలు ఉపయోగపడ్తాయనడంలో సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మహారాష్ట్ర ఎన్నికల్లో మజ్లిస్సంచలనమే నమోదు చేసింది.

భారతీయ జనతాపార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మహరాష్ట్ర టైపు ప్లాన్ ను అమలు చేయాలని చూస్తోందని పార్టీ అంతర్గత వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బాబుకు ఝలక్ ఇచ్చి,  పవన్ ను ముందుకు పెట్టి, వివిధ పార్టీల నుంచి నాయకులను సమీకరించి, అధికారం దిశగా నడవాలన్నది మోడీ ప్రణాళికగా చెప్పుకుంటున్నారు. పవన్ కు ఇప్పటికే దిశగా దిశానిర్దేశం చేసినట్లు ఆయన అభిమానులు అనుకుంటున్నారు. మోడీ వచ్చి వేయి కోట్లు ప్రకటించిన తరువాతే పవన్ కదిలి వెళ్లారు. వెళ్తూనే మోడీనీ ప్రశంసలతో ముంచెత్తారు. విశాఖ వెళ్లిన తరువాత సీన్ కూడా అలాగే వుంది. భాజపా మంత్రి కామినేని శ్రీనివాస్ స్వయంగా పవన్ పర్యటన వ్యవహారాలు చూసినట్లు వినికిడి
పవన్ ను అభిమానించే ఆయన సామాజిక వర్గానికి చెందిన ఘంటా, నారాయణ సంగతి చెప్పనక్కరలేదు. భాజపా శ్రేణులు కనిపిస్తున్నాయి తప్ప, జనసత్తా మేము..అనేవారు కనిపించలేదు. అంటే ఇక పవన్ పూర్తిగా భాజపా గ్రిప్ లోకి వెళ్లినట్లే అనకోవాలి. పైగా పవన్ పక్కా రాజకీయ వేత్తగానే వ్యవహరిస్తున్నారు. కాటన్ చొక్కాలు ధరించి వెళ్లడం, పనిలో పని బాబును, మోడీగా ప్రశంసించడం చేస్తున్నారు.  పవన్ కూడా విమర్శలు తగవని అంటూనే ఎదుటి వారు విమర్శించేలా మాట్లాడుతున్నారు. అనుభవం వున్నవారు ముఖ్యమంత్రి అయినందువల్ల మంచే జరిగిందన్నట్లుగా అంటున్నారు. ఇది సహజంగానే జగన్ అభిమానులకు ఇబ్బందిగా వుంటుంది
వీటన్నింటిని పరిశీలించినవారు చిరంజీవికి రాజకీయాలు అబ్బలేదు కానీ, పవన్ కు బాగానే అబ్బాయని కామెంట్ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లినా చిరంజీవి గ్లామర్ గా వుండాలనుకుంటారు. కానీ పవన్ డీగ్లామర్ గా తయారై వెళ్తారు. సో అన్ని విధాలా పవన్ వచ్చే ఎన్నికల నాటికి రెడీ అవుతున్నట్లే కనిపిస్తోంది

భాజపా కూడా మహరాష్ట్ర ప్రయోగం సక్సెస్ అయింది కాబట్టి, సీట్ల తకరారు తెచ్చుకుని బాబుకు టాటా చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. భాజపాలో వున్న ఎవరికీ ఇలాంటి పరిణామం సంభవించినా ఆనందమే కానీ చింత లేదు. వుంటే గింటే ఒక్క వెంకయ్యనాయుడు గారికే వుండాలి. ఎందుకంటే తెలుగుదేశం, భాజపా పెళ్లికి పురోహితుడాయన. అది పెటాకులైతే ఆయన సహించలేరు. ఆయన తన సర్వస్వం ఒడ్డి అయినా దాన్ని నిలబెట్టాలని చూస్తారు. కానీ మోడీ తలుచుకుంటే మాత్రం తల ఒంచక తప్పదు.

Viewers

Popular Posts

Latest Posts

Education

Health

Hyderabad

Business

Sports