మజ్లిస్ అనూహ్య సంచలనం.!
మూడు చోట్ల గెలుపు.. ఒక చోట ఆధిక్యం.. మజ్లిస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ స్థాయిలో రాణించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. మామూలుగా అయితే మజ్లిస్ పార్టీ పేరు ‘ఆల్ ఇండియా మజ్లస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ అయినా.. ఆ పార్టీ కేవలం తెలంగాణ రాజధాని హైద్రాబాద్కే పరిమితమైపోయింది. అడపా దడపా తెలంగాణలోని మరికొన్ని నియోజకవర్గాల్లో మజ్లిస్కి కొంత ఓటు బ్యాంకు వున్నట్లు నిరూపితమవుతున్నా.. అవేవీ ఆ పార్టీకి ప్రజా ప్రతినిథుల్ని తెచ్చిపెట్టే రేంజ్లో కావు. కానీ, మహారాష్ట్రలో మాత్రం మజ్లిస్ పార్టీ మూడు ఎమ్మెల్యే సీట్లను దక్కించుకుంది. ఇంకో సీటు దక్కేలా వుంది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఇదివరకు కూడా మహారాష్ట్రలో మజ్లిస్ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించింది. హైద్రాబాద్తో సమానంగా, మహారాష్ట్రలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని మజ్లిస్ సీరియస్‌గా తీసుకుంటూ వస్తోంది. ఈసారి దక్కిన ఫలితాలతో మజ్లిస్ వర్గాల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేనలకు ఎక్కువ సీట్లు దక్కడంతో మజ్లిస్ ఉనికి చాటుకున్నా.. ఆ పార్టీకి ఒరిగేదేమీ వుండకపోవచ్చు. కానీ, ఎంతో కొంత మహారాష్ట్రలో మజ్లిస్ శ్రేణులు మాత్రం తమ పార్టీని మరింతగా విస్తరించేందుకు ఈ ఫలితాలు ఉపయోగపడ్తాయనడంలో సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మహారాష్ట్ర ఎన్నికల్లో మజ్లిస్ సంచలనమే నమోదు చేసింది.
0 comments:
Post a Comment