నేటి మాట

బ్రతుకు ఒక పోరాటం, దాని కోసం ఆరాటం పనికి రాదు. --కాళోజి-!

Showing posts with label Aishwarya rai. Show all posts
Showing posts with label Aishwarya rai. Show all posts

ఐష్ పాటలో సన్నీలియోన్!


బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్... ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్తో పోటీపడుతోంది. అదేంటి? వారిద్దరి మధ్య పోటీ ఏంటని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే...1999లో ఐశ్వర్యరాయ్, సల్మాన్ఖాన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం హమ్దిల్ దే చుకే సనమ్. చిత్రంలో ఐశ్వర్యరాయ్పై తెరకెక్కించిన ధోలీ తారో ధోలీ భాజే గీతం సూపర్హిట్గా నిలవడమే కాకుండా అనేక అవార్డుల్ని అందుకొంది. ప్రస్తుతం గీతం రీమిక్స్ రూపంలో లీలా చిత్రంతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకురానుంది.

సన్నీలియోన్ కథానాయికగా నటిస్తున్న చిత్రానికి బాబీఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పాట రీమిక్స్ హక్కులను హమ్దిల్దే చుకే సనమ్ నిర్మాత భూషణ్కుమార్ నుంచి సొంతం చేసుకున్న బాబీఖాన్ దీనిని సన్నీలియోన్పై తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాటలో సన్నీలియోన్ నృత్యాలు ఐశ్వర్యరాయ్కు ధీటుగా ఒరిజినల్ సాంగ్ను మరిపించేలా వుంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రీమిక్స్ సవాల్గా స్వీకరించిన సన్నీలియోన్ ఇందుకోసం కొన్నాళ్లుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆమె పాటకు పూర్తిగా న్యాయం చేస్తుందనే నమ్మకముందని దర్శకుడు బాబీ ఖాన్ చెబుతున్నారు.

Viewers

Popular Posts

Latest Posts

Education

Health

Hyderabad

Business

Sports