ప్రపంచంలో తొలి డ్యూయల్ స్క్రీన్ ఫోన్
-ఫ్లిప్కార్ట్ ద్వారా అందుబాటులోకి.. ధర రూ.23,499
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన రిటైల్ విక్రయ సంస్థ జంబో ఎలక్ట్రానిక్స్.. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో జతకట్టింది. ఇరువురు కలిసి ప్రపంచంలో తొలి డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ఫోన్ను భారత్లో ప్రవేశపెట్టారు. యొటాఫోన్ పేరుతో డిజైన్ చేసిన ఈ మొబైల్ ఖరీదును రూ.23,499గా నిర్ణయించారు. ఈ ఫోన్కు ఒకవైపు లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, మరోవైపు ఎలక్ట్రానిక్ పేపర్ డిస్ప్లే(ఈపీడీ) ఉంటాయి. ఈ డివైజ్ స్మార్ట్ఫోన్తోపాటు ఈ-రీడర్లా కూడా పనిచేస్తుందని తయారీదారులు యొటా డివైజ్ పేర్కొంది. అంటే మొబైల్ స్క్రీన్ను ఆన్ చేయకుండానే ఈపీడీ ద్వారా మనకు కావాల్సిన సమాచారాన్ని యాక్సెస్ చేసుకునేందుకు వీలుంటుంది. తద్వారా బ్యాటరీ అధికకాలం పనిచేస్తుంది.
0 comments:
Post a Comment