నేటి మాట

బ్రతుకు ఒక పోరాటం, దాని కోసం ఆరాటం పనికి రాదు. --కాళోజి-!

హుస్సేన్సాగర్కు కొత్త హంగులు


హుస్సేన్ సాగర్ పూర్తిగా శుద్ధికావాలి. అందులో స్వచ్ఛమైన నీరు ఉండాలి. చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మించాలి. భవనాల్లో నుంచి స్వచ్ఛమైన సాగర్ నీరు కనిపించే (లేక్ వ్యూ) విధంగా ఉండాలి. దీనివల్ల నగరానికి కొత్త అందాలు రావడమే కాకుండా ప్రతిష్ట మరింత ఇనుమడించే అవకాశముంది. ఇలా చే సేందుకు ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎనుకాడొద్దు. సాగర్ భూములను పరిరక్షించేందుకు కఠినంగా వ్యవహరించాలి. ఇదీ ప్రస్తుతం జీహెచ్ఎంసీ, హెంఎండీఏ ప్రణాళిక. దిశగా కార్యాచణకు రంగం సిద్ధమవుతోంది.

హుస్సేన్సాగర్ పరిసరాల్లో ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించరాదని గతంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు జలాశయాల రిసరాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయరాదని, వాటి పరిరక్షణకు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సైతం గతంలో ఆదేశించింది. నేపథ్యంలో హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ వ్యవహారం చర్చనీయాంశమైంది. సాగర్ ఒడ్డు సుమారు 2,35,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించిన ప్రసాద్ ఐమాక్స్ మల్టీప్లెక్స్ పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు గతంలోనే తేలింది. అలాగే ఎఫ్టీఎల్ పరిధిలోనే జలవిహార్ పేరుతో నిర్మాణాలు చేశారు. అంతేకాదు ఎఫ్టీఎల్ పరిధిలోనే డాక్టర్ కార్స్ పేరుతో పాతకా ర్ల విక్రయ కేంద్రం కొనసాగుతోంది. దీని లీజు కాలం పూ ర్తయినప్పటికీ కోర్టు స్టే ముసుగులో కొనసాగిస్తున్నారు. ఇలా సాగర్ చుట్టూ జరిగిన నిర్మాణాలు, లీజు భూముల పై కోర్టుల్లో సుమారు 26 వరకూ కేసులు నడుస్తున్నాయి.

సాగర్ను ఖాళీచేయడమే శుద్ధికి పరిష్కారమా?

సాగర్ నీటిని శుద్ధిచేసేకన్నా పూర్తిగా నీటిని బయటకుపం పి కొత్తగా వర్షపునీరు చేరేలా ఏర్పాటు చేయడం ఉత్తమ మార్గమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నీటిని తొలగించడం వల్ల పూడిక తీసుకునే అవకాశం కూడా కలుగుతుందని, ఫలితంగా నగరంలో భూగర్భ జలాలు కూడా కలుషితం లేకుండా మెరుగయ్యే వీలు కలుగుతుందని చెబుతున్నారు. హుస్సేన్సాగర్ శుద్ధి పనులు కొంద రు అధికారులకు జేబులు నింపే కార్యక్రమంగా మారిందనే విమర్శలున్న నేపథ్యంలో విధానం సర్వత్రా చర్చ కు దారితీసింది. అంతేకాకుండా ఇంత భారీస్థాయిలో పూర్తిగా విషంగా మారిపోయిన నీటిని పూర్తిస్థాయిలో శుద్ధిచేసిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నా రు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కొన్నిచోట్ల చెరువులను శుద్ధి చేసినప్పటికీ అవి చిన్నచెరువులని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ సాగర్ను పూర్తిగా ఖాళీచేసినా నాలుగైదు ఏళ్లలో (వర్షాల ఆధారంగా) మళ్లీ యథావిధంగా లాలు వచ్చే వీలుంటుందన్నారు.


కోర్టు కేసులపై అడ్వకేట్ జనరల్ అధ్యయనం

బుధవారం అధికారులతో జరిపిన చర్చల సందర్భంగా సాగర్ ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలు, వాటిపై కొనసాగుతున్న కేసుల అంశం ప్రస్తావనకొచ్చినట్లు తెలిసింది. సాగర్ పరిసర భూములకు సంబంధించి మొత్తం 26వరకూ కేసులు నడుస్తున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో కేసులపై అడ్వకేట్ జనరల్చే సమగ్రంగా అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నివేదిక సిద్ధమైన తరువాత ఎఫ్టీఎల్ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. 

ఎఫ్టీఎల్లో నిర్మాణాలపై నీలినీడలు

సాగర్ను ప్రక్షాళన చేయాలని సర్కారు సంకల్పించడంతో ఎఫ్టీఎల్లో వెలిసిన భారీ నిర్మాణాలపై నీలినీడలు మ్ముకున్నైట్లెంది. నీటి రాకకు అడ్డుగా నిర్మించిన నిర్మాణాలవల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపునీరు సాగర్లోకి చేరడంలేదు. మరోవైపు, మురుగునీటి కాలువల ద్వారా వచ్చే నీటితో సాగర్ నిండిపోతోంది. కొత్తనీరు చేరే మార్గంలేక, రోజూ మురుగునీటి కాలువలు కలుస్తూపోవడంవల్ల సాగర్ పూర్తిగా మురికికూపంగా తయారైంది. ఒకవేళ సాగర్ను ప్రక్షాళన చేయాల్సివస్తే వరదనీరు చేరేందు కు తగిన ఏర్పాట్లు చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. కొత్తనీరు చేరితేనే మురుగు శుద్ధి వీలవుతుందని పేర్కొంటున్నారు. నేపథ్యంలో ఎఫ్టీఎల్లో వెలిసిన నిర్మాణాల అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.


0 comments:

Post a Comment

Viewers

Popular Posts

Latest Posts

Education

Health

Hyderabad

Business

Sports