అప్పుడే అయిపోయిందా బాబూ?
రాజకీయనాయకులు ఆవేశంలో అనేక మాటలు మాట్లాడేస్తుంటారు. చంద్రబాబు కూడా ఇందుకు అతీతులు కారు. ఆఖరి బాధితుడికి సైతం పరిహారం అందేవరకు, అన్ని పనులు పూర్తి అయ్యేవరకు విశాఖలోనే వుంటా అని శపథం చేసి వెళ్లారు బాబు. అయిదు రోజులపాటు అక్కడ తాను చేయగలిగింది చేసారు. బాగానే వుంది. ఇప్పటికి ఇంకా విశాఖలోనే యాభై శాతం మందికి ఇంకా కరెంటు లేదు. ఇక జిల్లా సంగతి చెప్పనక్కరలేదు. విశాఖ తరువాత పెద్ద పట్టణమైన అనకాపల్లిలో ఒక్క ఇంటికి కూడా పవర్ రాలేదు. ఇక పల్లెల సంగతి చెప్పనక్కరలేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సంగతి అంతే. మరి బాబు మాత్రం విశాఖ బిచాణా సర్దేశారు. హైదరాబాద్ వచ్చేసారు. మరోపక్క రాయలసీమలో ఒక రోజు, విజయవాడలో ఒకటి రెండు రోజులు పర్యటన పెట్టుకున్నారు. ఆ తరువాత రెండు రోజులు మళ్లీ విశాఖ వెళ్లి ప్రదర్శనలో పాల్గొని వచ్చేస్తారు. సిఎమ్ అక్కడ వుంటేనే జనాలకు సాయం అంతంతమాత్రంగా అందింది. కరెంట్ ఇంతవరకు రాలేదు. మరి ఆయన వెనక్కువచ్చేస్తే పరిస్థితి ఏమిటో? లేదా ఆయన అనుకున్నట్లు, శపథం చేసినట్లు ఆఖరి బాధితుడికి కూడా పరిహారం అందేసిందా? కనీస అవసరాల పునరుద్దరణ జరిగిపోయిందా?
0 comments:
Post a Comment