Tue Apr 15 2025

నేటి మాట

బ్రతుకు ఒక పోరాటం, దాని కోసం ఆరాటం పనికి రాదు. --కాళోజి-!

నాటి వివక్షతోనే నేటి విద్యుత్ కష్టాలు!

తెలంగాణలో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతున్నది. ఖరీఫ్ సీజన్లో సాధారణంగా వినియోగించే కరెంటు కన్నా సమయంలో వినియోగం బాగా ఎక్కువైంది. దీని ప్రభావం మొత్తం అన్ని రంగాలపై పడి కరెంటు 
సరఫరాపై తీవ్రంగా పడుతున్నది. వర్షాలు లేకపోవడంతో బోర్లు, బావుల కింద పంట సాగు అధికంగా ఉన్నది. దీనివల్ల విద్యుత్ వినియోగం డిమాండ్ బాగా పెరిగింది.

కొన్ని రోజులుగా తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. నానా తంటాలు పడి ఆరుగాలం శ్రమించే రైతులు నేలరాలడం బాధాకరమైన విషయమే? రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాల్సిందే. సాగు చేసిన భూమిలో మొలకెత్తిన మొక్కలకు నీరు అందక ఎండిపోతున్న పైరులను చూసి అల్లాడుతున్న రైతు, ఎం డిన బీళ్లు చూడలేక చలించిపోయి తనువు చాలిస్తున్నాడు.

వర్షాలు లేకపోవడం ద్వారా బోర్లపైనే ఆధారపడే రైతులు కరెంటు కోసం పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కాదు.అప్పు చేసి సాగు చేసిన పంటలు మధ్యలోనే ఎండిపోవడంతో చేసిన అప్పు, చేసిన సాగు.. పంటలు మధ్యలోనే ఎండిపోవడం ద్వారా చేసిన అప్పు ఏవిధంగా తీర్చాలో అనే తపనతో మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు అన్నివర్గాల భరోసా అవసరమే. అయితే రైతన్నల ఆత్మహత్యలపై ప్రతిపక్ష పార్టీలు పాలక ప్రభుత్వంపై అర్థం పర్థంలేని విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతులభరోసా యాత్ర పేరుతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు తలా మూడు జిల్లాల పర్యటించి రైతుల ఆత్మహత్యలకు పాలక పార్టీనే ముద్దాయిని చేసి చూపిస్తున్నాయి. అయితే రైతన్నల ఆత్మహత్యలకు కారకుపూవరు? పాలక పార్టీనా! కరెంటు కోతలా! కరువు కాలమా! లేదా గత ప్రభుత్వ విధానాలా! అనేది చూడాల్సిన అవసరం ఉన్నది.

మొదటగా వర్షాభావం పరిస్థితి చూద్దాం. వ్యవసాయానికి ప్రాణాధారమైన వర్షాలు మొఖం చాటు వేయడంతో రాష్ట్రంలో కరువు అల్లాడుతున్నది. తొలకరి వానలకు సైతం నోచుకోకపోవడంతో గత కొన్నేళ్ళుగా ఎన్నడులేని విధంగా పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. వర్షపాతం గణనీయంగా తగ్గిపోవడంతో రాష్ట్రంలో జిల్లాలో దుర్భిక్షం నెలకొన్నది. వర్షపా తం సాధారణం కన్నా 40శాతం తక్కువ కురిసింది. ఫలితంగా రాష్ట్రంలో వరిపంట 1.64 లక్షల హెక్టార్లలో, మొక్కజొన్న 3.22 లక్షలు, పెసర 0.5లక్షలు, కంది 1.75 లక్షలు, మినుము 0.15 లక్షలు, సోయా 2.10 లక్షలు, పత్తి 12.12 లక్షలు, జొన్న 0.34 లక్షలు, ఆముదం 0.55 లక్షల హెక్టార్లలో రైతులు సాగు చేయడం జరిగింది. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో అతి తక్కువగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. దీంతో 52 శాతం మేరకే సాగు చేయడం జరిగింది.

ఆదిలాబాద్ జిల్లా లో 14.2 సెంటీమీటర్ల వర్షపాతంతో రాష్ట్రంలో మొదటిస్థానం ఉండి 7 శాతం సాగు చేయడం జరిగింది. అయితే గతంతో పోలిస్తే పంట సాగు చాలా తక్కువని వ్యవసాయ అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. వర్షాభావం తగ్గం వల్ల పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆత్మహత్యలు చేసుకుని కడుపుకోత మిగుల్చుతున్నారు. దీనికి పాలక పార్టీనే కారణం అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టం చూస్తుంటే కాం గ్రెస్, టీడీపీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వేలా ది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా! మరి ఆత్మహత్యలకు గత పాలకులు బాధ్యత వహించగలరా!
రెండవది కరెంటు కష్టాలు - తెలంగాణలో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతున్నది. ఖరీఫ్ సీజన్లో సాధారణంగా వినియోగించే కరెంటు కన్నా సమయంలో వినియోగం బాగా ఎక్కువైంది. దీని ప్రభావం మొత్తం అన్ని రంగాలపై పడి కరెంటు సరఫరాపై తీవ్రంగా పడుతున్నది. వర్షాలు లేకపోవడంతో బోర్లు, బావుల కింద పంట సాగు అధికంగా ఉన్నది.

దీనివల్ల విద్యుత్ వినియో గం డిమాండ్ బాగా పెరిగింది. గత ఏడాది అంటే జూలై-ఆగస్టు నాటికి 1500 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం ఉంటే, ఇప్పుడది 1900నుంచి రెండు వేల మొగావాట్లకు పెరిగిందని అధికార వర్గాలే తెలియచేస్తున్నాయి. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలకు ఏటా అగస్టు నుంచి అక్టోబర్ చివరి వరకు కరెంటు వినియోగం అధికంగా ఉంటుంది. కానీ సీజన్లో వర్షాలు లేకపోవడంతో జూలై నుంచే గరిష్ఠ స్థాయిలో పంటలకు విద్యుత్ వినియోగం పెరిగింది. గత ఐదేళ్ళలో ఇలాం టి పరిస్థితులు ఎన్నడూ ఎదురుకాలేదు.రాష్ట్రంలో బోర్లు, బావుల కింద 37లక్షల ఎకరాలు ఖరీఫ్లో సాగు చేయాల్సి ఉంది. కానీ కేవలం 25లక్షల ఎకరా లు మాత్రమే సాగుచేసినా విద్యుత్ వినియోగం భారీ గా పెరిగిందని అధికారవర్గాలు వాపోతున్నాయి. 

తెలంగాణ జెన్కో ద్వారా 409మెగావాట్ల విద్యు త్ ఉత్పత్తి జరుగుతున్నది. ఇందులో ధర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా 2744.35మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉండగా తరచూ అనేక యూనిట్లలో లోపాలు తలెత్తి ఉత్పత్తి తగ్గుముఖం పడుతున్నది. ఇటీవలి కాలంలో కొత్తగూడెం, కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పలుమార్లు లోపాలు తలెత్తగా మరికొన్ని చోట్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ నిలిపివేయడం జరుగుతున్నది. ఇదే గాకుండా నాసిరకం బొగ్గు కారణంగా ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. వర్షా లు లేక పోవడంతో జల విద్యుత్కేంద్రాలు పని చేయ డం లేదని,దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సమస్యలు తరుచూ తలెత్తుతున్నాయని విద్యుత్ అధికారులు అంటున్నారు.

అయితే కరెంటు కష్టాలకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని చెప్పక తప్పదు. ఎందుకంటే జలయజ్ఞం ప్రాజెక్టుల క్రింద వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసినా తెలంగాణ రైతాంగానికి ఫలితం మాత్రం దక్కలేదు . ఉదాహరణకు మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోత పథకమే దీనికి నిదర్శనం. మూడేళ్లలో పనులు పూర్తిచేసి ఆయకట్టుకు నీరందిస్తామని 2004లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మూడేళ్ళ కాదు కదా! పదేళ్ళు పూర్తయింది. పనులు పూర్తి కాలే దు. జరిగిన పనిలో కూడా అంతా డొల్లతనం కనబడుతున్నది. 25 టీఎంసీల నీటి వినియోగంతో 3.4 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు సాగు నీరందించేందు కు 2990 కోట్ల రూపాయలతో పనులు చేపట్టింది.

ఆరు ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లతో ఒప్పం దం కుదుర్చుకున్నారు. ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశారు. కానీ కాంగ్రెస్ పాలకులు 3.4 లక్షల ఎకరాలకు కాదు కదా 34 వేల ఎకరాలకు కూడా నీరు అందించలేదు. అంటే కాంగ్రెస్ పాలకు లు తెలంగాణ రైతాంగానికి ఎంతటి మేలు చేసిండ్రో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో భారీ నీటి ప్రాజెక్టుల కట్టలు పూర్తి అయి ఉంటే తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందేది. పంటలు ఎలాంటి ఆటంకాలు లేకుండా రైతు చేతికొచ్చి లాభాలు చేకూర్చేవి. తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచిన కాంగ్రెస్రైతు భరోసాపేరుతో ప్రజల్లోకి వెళ్ళినా తగిన స్పం దన రాకపోవడంతోనే మూడు జిల్లాలకు పరిమితం అయ్యిందని చెప్పక తప్పదు. జలయజ్ఞం పేరిట లక్ష కోట్ల రూపాయలు అవినీతికి కారకులైన కాంగ్రెస్ నాయకులు పంట సాగుకు మాత్రం నీరు అందించలేకపోయారు.

ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణలో ఉనికి కోల్పోయినా రైతుల పేరుతో యాత్రలు చేసి రైతులను పరామర్శింస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి. కానీ కరెంటు కోసం బషీర్ బాగ్ దండయాత్ర చేసిన వామపక్షాల కార్యకర్తలను పిట్టాల్లా కాల్చి చంపిన టీడీపీ నేతలు ఇవ్వాళ కరెంటు కోతలపై మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది. రైతు రాజ్యమే రామరాజ్యం అని అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు అప్పట్లో రైతులను అనేక విధాలుగా ఇబ్బందుల పాలు చేసిన సంఘటనలు రైతులు ఎవ్వరూ మరువలేదు. రైతుల ఆత్మహత్యల్లో నాటి ఉమ్మడి ఆంధ్రవూపదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత చంద్రబాబుకే దక్కింది. తన పదేళ్ల పరిపానలో సుమారు 17,242 మంది రైతులను పొట్టన పెట్టుకున్న టీడీపీ నాడు రైతు ఆత్మహత్యలపై మాట్లాం చూసి బాధిత కుటుంబాలు విస్తుపోతున్నాయి. నేపథ్యంలోనే విద్యుత్ సంక్షో భానికి గత పాలకులే కారణమని రైతులు కన్నెర్ర చేయడంతో మధ్యలోనే తమ యాత్రలు ఆపి ఢిల్లీకి నివేదిక ఇస్తామని పయనం అవుతున్న తీరు కనపడు తూనే ఉన్నది.

గత 17ఏళ్లలో సుమారు 33,326 మంది రైతుల ఆత్మహత్యలపై అనేక అధ్యయనాలు జరిగాయి. 2004లో జయతిఘోష్ కమిషన్, 2006 లో జస్టిస్ రామచంవూదాడ్డి కమిషన్, 201లో మోహన్ కందా కమిటీ ఆధ్వర్యంలో రైతు ఆత్మహత్యలపై అనేక సిఫార్సులు చేశాయి. ముఖ్యంగా రైతులందరికీ సాగునీరు అందించాలని, కౌలుదారులతో సహా రైతులందరికి బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని చెప్పాయి. గిట్టుబాటు ధరపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలని సూచించాయి. కానీ సిఫార్సులు ఏవి కూడా అమలు కాకుండా పోవడం వల్లే వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు నష్టం కలిగిస్తూ బడా బాబులకు లాభాలు చేకూర్చే గత పాలకులు అన్ని విధాలుగా రైతులను నిర్లక్ష్యం చేశారు. వివక్ష, నిర్లక్ష్యాల కారణంగానే రైతుల ఆత్మహత్య పరంపర కొనసాగింది. నేటికీ కొనసాగుతున్నది.

ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గత పాలకులు తెలంగాణకు చేసిన నస్టాన్ని అధిగమించే పనిలో ఉన్నది. ముఖ్యంగా రైతాంగానికి అన్ని విధాలుగా ఆదుకొనేందుకు సిద్ధం అయింది. ‘రుణమాఫీపథ కంతో సుమారు 36లక్షల మంది రైతులకు అప్పులు మాఫీ చేస్తూ రైతులకు ధృవీకరణ పత్రాలు సిద్ధం చేసింది. ప్రస్తుతం 25 శాతం బ్యాంక్ రుణాలు ప్రభుత్వమే చెల్లించి మిగతా 75శాతం వచ్చే మూడు సంవత్సరాల కాలంలో తెలంగాణ సర్కారు బ్యాంకులకు రుణం చెల్లించనున్నది. ఈలోగా రైతులు బ్యాంకర్ల ద్వారా కొత్త రుణాలు తీసుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నది.

విషయం అర్థంగాక కొందరు రైతు లు ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడు తున్న తీరు కనిపిస్తున్నది. పరిస్థితిని ప్రతి పక్షాలు రాజ కీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడటం విషాదం. అంతకన్నా జాతి ద్రోహం. 
ఇప్పుడున్న పరిస్థితిలో రైతాంగానికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. విపక్షాలు విమర్శలు మానుకొని ప్రభుత్వానికి సహకారం అందించాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తెలంగాణ కరువు-కంటు కష్టాలను తీర్చాలి. తెలంగాణ నవ నిర్మాణంలో రైతుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకుసాగాలి. అందుకు పార్టీలకతీతంగా కలిసి నడవాలి. 

Related Posts:

  • Buffaloes’ day out Buffaloes’ day out Hyderabad: It was a celebration of a different kind. When the Yadav community gets together at ‘Sadar’, it’s all about harmony and exhibiting the male buffalo, a symbol of their existence. A tradit… Read More
  • తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆవిర్భవం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆవిర్భవం ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆవిర్భవించింది. దీనికి సంబంధించి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు చట్టం-1971ని తెలంగాణ ప్రభుత్వం స్వీకరించింది. ఇకనుంచి తెలంగాణ ఇంటర… Read More
  • తెలంగాణ బిడ్డకు కార్టూన్ నోబెల్! తెలంగాణ బిడ్డకు కార్టూన్ నోబెల్! ఈ వారం నోబెల్ ప్రైజ్‌ల సందర్భం. చిన్న పిల్ల మలాలాకు వచ్చింది. అద్భుతం. అట్లే పిల్లలపై పనిచేస్తున్న సత్యార్థికీ వచ్చిం ది. శుభం. అంతకన్నా సంతోషం కార్టూన్ ప్రపంచంలో నోబెల్ ప్రైజ్‌గా ఎన్నద… Read More
  • విపక్షాలా? ఆంధ్రాపక్షాలా? విపక్షాలా? ఆంధ్రాపక్షాలా? తెలంగాణ పట్ల బాబుకు అంత ప్రేమే ఉంటే.. తాజాగా కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల విద్యుత్‌లో తెలంగాణకు వాటా లేదని ఎలా చెపుతున్నారో? కృష్ణపట్నం థర్మల్ విద్యుత్, హిందూజా విద్యుత్‌పై పీపీఏలను ఈఆర్‌సీ… Read More
  • Top 10 Places To Visit In Telangana Top 10 Places To Visit In Telangana The State of Telangana is to be a newly christened state of India on the 2nd of June 2014. The region was a part of the Indian State of Andhra Pradesh. It contains 10 … Read More

0 comments:

Post a Comment

Viewers

3752

Popular Posts

Latest Posts

Education

Health

Hyderabad

  • Hyderabad Places
    Charminar  Charminar is considered the signature of Hyderabad like how Taj Mahal is...
  • మజ్లిస్ అనూహ్య సంచలనం.!
    మజ్లిస్‌ అనూహ్య సంచలనం.! మూడు చోట్ల గెలుపు.. ఒక చోట ఆధిక్యం.. మజ్లిస్‌ పార్టీ మహారాష్ట్ర...

Business

Sports

Articles